Monday, 11 November 2019

Engineering Services Examination Prelims 2019 GS Paper ‘ఎథిక్స్ మరియు విలువలు, ఇంజనీరింగ్ వృత్తి లో’ ESE Ethics



ఎథిక్స్ మరియు విలువలు, ఇంజనీరింగ్ వృత్తి లో’

ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష కోసం ప్రతి ఏటా UPSC నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష లో జనరల్ స్టడీస్ మరియు ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ అనే ఒక పేపర్ ఉంటుంది. దీనిలో 200 మార్కులకు 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహా లో ఇస్తారు. UPSC ఇచ్చిన సిలబస్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష GS పేపర్ లో ‘ఇంజనీరింగ్ ప్రోఫెషన్ లో ఎథిక్స్ మరియు విలువలు’ అనే ఒక అంశం ఉంది. ఈ అంశం నుండి ప్రతి సంవత్సరం 5 నుండి 8 ప్రశ్నల వరకు ఇస్తున్నారు.

గ్రీకు తత్వవేత్త అయిన సోక్రటీస్ ను ‘ఎథిక్స్’ కి పితామహుడుగా చెపుతారు. ఆయన శిష్యుడైన ప్లేటో కూడా ‘జస్టిస్ ‘ గురించి ప్రముఖం గా చెప్పాడు. ప్లేటో శిష్యుడైన అరిస్టాటిల్ , ‘ఎథిక్స్’ పై విశేష అధ్యయనం చేశాడు . ఒక వ్యక్తికి  ఉండే  డిసిప్లిన్ (క్రమ శిక్షణ ) వల్ల మంచి నడవడిక ఏర్పడుతుంది . మంచి నడవడిక వల్ల మంచి అలవాట్లు ఏర్పడతాయి అని అంటారు.
UPSC వారు ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఎగ్జాం (CSE) లో ఎథిక్స్ పేపర్ ను మెయిన్స్ దశలో  నిర్వహిస్తున్నారు.     ఇంజనీరింగ్ సర్వీసెస్  ఎగ్జాం (ESE) లోకూడా  ప్రిలిమినరి దశలో నే జనరల్ స్టడీస్ పేపర్ లో ‘ఎథిక్స్ మరియు విలువలు ఇంజనీరింగ్ వృత్తి లో’ అనే అంశం చేర్చారు.   UPSC వారు ESE కోసం ప్రత్యేకం గా ఎథిక్స్ సంబంధించిన  టాపిక్ లు ఇవ్వలేదు. కాని 2016 నుండి నిర్వహించిన ESE ప్రిలిమినరీ పరీక్ష GS పేపర్ లో ఇచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే , ఈ కింది  టాపిక్ లనుండి ప్రశ్నలు వస్తున్నాయి:-
1) ఎపిస్టేమోలజి నిర్వచనం, ఎథిక్స్ నిర్వచనం 
2)ఇంజనీరింగ్ ఎథిక్స్ కి నిర్వచనం ,  పరిచయం
3)ఇంజనీరింగ్ ప్రోఫెషన్ లో ఎథిక్స్ మరియు నైతిక విలువలు
4)మానవ విలువలు మరియు మనస్తత్వశాస్త్ర్రo  
5) ఆర్గనైజేషనల్ బిహేవియర్ & మేనేజ్ మెంట్
6)బిజినెస్ లోనూ మరియు ప్రభుత్వం లోనూ ఎథికల్ గవర్నెన్స్ (నీతినిజాయితీ తో కూడిన పరిపాలన )
7)నీతి శాస్త్ర తత్వ వేత్తలు , అడ్మినిస్ట్రేటివ్  మరియు  మేనేజ్ మెంట్ సిద్ధాంత కర్తలు
8) ప్రస్తుత సమాజం లో ఎథికల్ అంశాలు
9) IEEE.NSPE, ఇంజనీరింగ్ కౌన్సిల్ అఫ్ ఇండియా , ఇన్స్టిట్యూషన్ అఫ్ ఇంజనీర్స్ (ఇండియా) , అసోసియేషన్ అఫ్ కంప్యూటింగ్ మిషనరీ వంటి సంస్థలు తెల్పిన ‘కోడ్ అఫ్ ఎథిక్స్’ ; రెండవ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ప్రతిపాదించిన ‘కోడ్ అఫ్ కాండక్ట్’ , మొదలైన వి .

 ESE-2019 ప్రిలిమినరీ పరీక్ష లో GS పేపర్ లో ఈ  కింది అంశాలపై ప్రశ్నలను  ఇచ్చారు:-

ఎపిస్టేమాలజి: -
గ్రీకు భాషలో ‘ఎపిస్టెం’అంటే ‘నాలెడ్జ్’ . ‘లోగోస్’ అంటే ‘రీజన్ ‘ . ఎపిస్టేమాలజి అనేది ‘నాలెడ్జ్’ యొక్క సిద్దాంతం , పద్ధతులు , నమ్మకం , అభిప్రాయం  వంటి వాటిని అధ్యయనం చేస్తుంది.
నమ్మకాలను , నాలెడ్జ్ ను అధ్యనం చేయటమే ఎపిస్టే మాలజి అనే చెప్పవచ్చును.
విలువలు (Values) :
విలువలు అనే వి కొన్ని నమ్మకాల సెట్ . అవి ఒక వ్యక్తిని , ఒక సంస్థని , ఒక సమాజాన్ని  ఉత్తమ పంధా లో నడిపిస్తాయి. విలువలకి ఉదాహరణగా ఈ కిందివి చూద్దాం : -
(i) సహించుట/సహనము  :  సహనానికి  భారతీయ  సమాజం లో ప్రాచీన కాలం నుండి  ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ జీవన శైలి లో విడదీయరాని భాగం అయ్యింది .
(ii) ఎమ్ పథి (జాలి, దయతో ఇతరుల కష్టాలను తమ కష్టం గా భావించి, ఆలోచించటం, సాయ పడటం  )

సొసైటల్ డెవలప్మెంట్ : సాంఘిక మార్పు యొక్క ప్రాసెస్ ను ఇది తెలుపుతుంది

ఎథిక్స్ : -    
‘ఎథికోస్ ‘ అనే గ్రీకు పదం నుండి ఇది పుట్టింది. ’అలవాటు’ లేక ‘సంప్రదాయం ‘ అనే అర్ధం దీనికి ఉంది. అలాగే ‘ ఎథోస్’ అనే గ్రీకు పదానికి ‘కారక్టర్’(నడవడి) లేక ‘అలవాటు ‘ అనే అర్ధం కూడా ఉంది. ‘ఎథిక్స్ ‘ అనేది ‘మోరల్ ఫిలాసఫీ ‘ యొక్క శాఖ . ‘ఫిలో ‘ అనే గ్రీకు పదానికి ‘ప్రేమ ‘ అని అర్ధం . అలాగే ‘సోఫోస్ ‘ అనే గ్రీకు పదానికి ‘నాలెడ్జ్’ లేక జ్ఞానం అనే అర్ధం ఉంది. మోరల్ ఫిలాసఫీ అనేది నైతిక సిద్ధాంతాలను , ప్రశ్నలను , సవాళ్ళను  అధ్యయనం చేస్తుంది మరియు నిశితంగా విశ్లేషిస్తుంది.   
‘ఎథిక్స్ ‘ అనే దాన్ని మన చర్యలలో / అధికార విధులలో / పని లో ఉన్న నీతి నిజాయితీ అనుకోవచ్చును. ‘ఎథిక్స్ ‘ అనే ది ఒక వ్యక్తి కే కాకుండా , యావత్ సమాజానికి కూడా వర్తిస్తుంది.
ఎథికల్ విలువలలో ప్రధానమైనవి :-
1 ) నమ్మదగిన వ్యక్తిత్వం
2)గౌరవం
3) బాధ్యత
4) నిజాయితీ గా ఉండటం
కాగ్నిటివిజం:-
ఎథికల్ ఫిలాసఫీ యొక్క ఒక శాఖ ప్రకారం ప్రతి మనిషికి  ‘మంచి నుండి చెడును’, గుర్తించటం చాల స్పష్టం గా , లక్ష్యం గా ఉంటుంది
ఇంజనీరింగ్ ఎథిక్స్ : -
ఇది అప్లైడ్ ఎథిక్స్ యొక్క శాఖ . ఇంజనీర్ లు ఒక వృత్తి నిపుణులుగా , ఎథికల్ (నైతిక ) బాధ్యతలు వహించి , ఒక తప్పును /లోటు ను అధ్యాయం చేసి , ఎంక్వయిరీ చేస్తారు .
ఇంజనీరింగ్ ఎథిక్స్ యొక్క ప్రాధమిక సిద్ధాంతాలు:-
1)పబ్లిక్ సేఫ్టీ
2 ) మానవ హక్కులు
3 ) పర్యావరణo మరియు జంతువుల పరిరక్షణ
4 )ఇంజనీరింగ్ కాంపిటెన్స్ (సమర్ధత )
5 ) శాస్త్ర రీత్యా నిర్ధారించబడిన పద్ధతులలో న్యాయ నిర్ణయం
6) బహిరంగంగా తెలియచేయటం మరియు నిజాయితీ
వృత్తి పర నిర్లక్ష్యం (ప్రోఫెషనల్ నేగ్లిజెన్స్) :-
చేసే పనిలో (డ్యూటీ లో ) సరైన శ్రద్ధ పెట్టక పొతే , అందువల్ల ఏర్పడే గాయాలు , ప్రమాదాలు  ఏర్పడతాయి. వాటికి  ఆ వృత్తి ని చేపట్టే వారు బాధ్యత వహిoచాలి.
విజిల్ బ్లోయింగ్ (కాపలా కాసేవారు ఈల వేయటం ) : -
ఒక ఉద్యోగి తాను పనిచేసే సంస్థ లో జరిగిన అవినీతి పనులను , తనపై న పనిచేసే సూపర్ వైజర్ /అధికారులకు తెలియచేయటం . ఈ ప్రక్రియలోముందుగా    ఇవి పాటించాలి :-
1 )జరిగిన అవినీతి చర్యలను అధ్యయనం చేసి, ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి
2 )తనపై ఉన్న సూపర్ వైజర్ తో చర్చించాలి
3 )పై అధికారులకి తెలియచేయాలి
4) అంతర్గతం గా కార్యాలయం లోనే పరిష్కారం లభించక పొతే , బాహ్య ప్రపంచం లోని సంస్థలకి తెలియచేయాలి
కాన్ ఫ్లిక్ట్ అఫ్ ఇంటరెస్ట్ :-
ఉన్నత పదవులలో ఉన్నవారికి  , తమ ప్రైవేటు జీవిత అంశాలకి , అధికారికంగా ఇచ్చిన బాధ్యతలకి మధ్య ఏర్పడే స్పర్ధ ఇది .
(ESE-2018లో GS పేపర్ లో ప్రశ్న )
నెపోటిజం (బంధు ప్రీతి )  : -
ఉన్నత పదవులలో ఉన్నవారు  తమ బంధువులకి , స్నేహితులకి , ఉద్యోగాలివ్వటం , కాంట్రాక్టు లు ఇప్పించుకోవటం  
 (ESE-2018 GS పేపర్ లో  ప్రశ్న )


మేథోసంపత్తి హక్కుల చట్టం (IPRs) : -
మానవుల మేధస్సు చేత కనుగొనబడిన పరికరాలు , నూతన ఆవిష్కరణలు , డిస్కవరీ లు , మ్యూజిక్ , కళలు , రచనలు  మొదలైనవి దీని కిందకు వస్తాయి. వీటికి వాణిజ్య విలువ ఉంటుంది. పేటెంట్ హక్కులు ప్రసాదించ బడతాయి. వీటి తో చేసే వ్యాపారం లో వ్యాపార సీక్రెట్ ఉంటుంది.
(ESE – 2018 , 2019 లో GS పేపర్ లో ప్రశ్నలు వచ్చాయి. )
మైక్రో ఎథిక్స్ : -
ఒక ఇంజనీర్ యొక్క వృత్తి లోనూ , పర్సనల్ (వ్యక్తిగత ) జీవితం లోనూ ప్రభావితం చూపే ఎథికల్ అంశాలను ఇది తెల్పుతుంది .
(ESE-2017 లో GS పేపర్ లో ప్రశ్న )





No comments:

Post a Comment